గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకొండి – 32 కార్పొరేటర్

378
Aitha shiva kumar

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గొప్ప కార్యక్రమం గర్భిణీ స్త్రీ లకు పండ్లు మరియు కోడిగుడ్లు , బాలింతలకు మరియు పసి పిల్లలకు బాల అమృతం పంపిణీ కార్యక్రమం.

ఈరోజు స్ధానిక రామగుండం 32 వ డివిజన్ ఎల్బీనగర్ మరియు జవహర్ నగర్ లోని గర్భిణీలకు, బాలింతలకు ,ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు, స్కూల్ కి వచ్చే ప్రీ స్కూల్ పిల్లలకు 32 డివిజన్ కార్పొరేటర్ అయిత శివ కుమార్ గారి ఆధ్వర్యంలో THR పంపిణీ చేయడం జరిగింది. మరియు గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్ లో నే పురుడు పోసుకోవలని అవగాహనా కలిపించడం జరిగింది.

T.SAT విద్య ద్వారా రోజు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు పిల్లకు సంబందించిన ప్రోగ్రామ్లు ప్రసారం అవుతున్నాయ్. కావున తల్లిదండ్రులు వారికి చుపించావాల్సిందిగా కోరుతున్నాం. గర్భిణీ స్త్రీలు
ఇబ్బంది ఉన్న తక్షణమే సంప్రదించాలని తెలియజేయడం జరిగింది.

అంగన్వాడి టీచర్స్ అలెర్ట్ గా ఉండి వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని, గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్ లో అన్ని సౌకర్యాలు మీకోసమే ఏర్పాటు చేయడం జరిగిందని, మీకోసమే హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు అని వారికి ధైర్యం కల్పించడం జరిగింది.