సింగరేణి డైరెక్టర్‌ కు “నెయిబర్‌హుడ్‌ హీరో’’ అవార్డు

361
our neighborhood hero

విధుల నిర్వహణ, కంపెనీ అభివృద్ధి కార్యక్రమాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం తోపాటు, పర్యావరణ పరమైన చర్యలు, సమాజసేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పనిచేస్తూ ప్రశంసలందుకొంటున్న సింగరేణి కాలరీస్‌ సంస్థ డైరెక్టర్‌ (finance) శ్రీ ఎన్‌.బలరాం (IRS)కు హెచ్‌.డి.ఎఫ్‌.సి. బ్యాంకు ‘‘అవర్‌ నెయిబర్‌ హుడ్‌ హీరో’’ అనే అవార్డుతో సత్కరించింది.

హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ లో మంగళవారం HDFC bank అధికారులు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జోనల్‌ హెడ్‌ సౌత్‌ శ్రీ విశాల్‌ భాటియా, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు సర్కిల్‌ హెడ్‌ శ్రీ భద్రి విశాల్‌ లు శ్రీ ఎన్‌.బలరాం ను శాలువ, పుష్పగుచ్చాలతో సన్మానించి సైటేషన్ను బహుకరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ఎన్‌.బలరాం కంపెనీకి లాభం చేకూర్చే అనేక చర్యలను చేపట్టారనీ, పర్యావరణ హితం కోరి ఆయన ఒక్కరే 6,500 మొక్కలను సింగరేణి 10 ప్రాంతాల్లో నాటడం, అలాగే తన స్వగ్రామంలో మరో 5,000 మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు. అలాగే అనేక సమాజహిత కార్యక్రమాలు, సంఘసేవా కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటూ ఉంటారనీ, కనుక తమ పొరుగున ఉన్న హీరోగా ఆయన్ను గుర్తిస్తూ ఈ అవార్డును అందజేస్తున్నట్లు వారు తెలియజేశారు.

our neighborhood hero

ఈ సందర్భంగా డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) శ్రీ ఎన్‌.బలరాం మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేయడం చాలా గొప్ప అవకాశం, గొప్ప అదృష్టమనీ, రాష్ట్రానికి వెలుగు పంచే సింగరేణిలో తాను కూడా ఒక సభ్యుడిగా ఉండడం ఎంతో ఆనందం కల్గిస్తుందని అన్నారు. తన సేవకు గుర్తింపుగా అవార్డును బహుకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఇంకా హెచ్‌.డి.ఎఫ్‌.సి. , డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ శ్రీనివాస్‌ చక్రవర్తి, రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌ శ్రీ అనిల్‌ నాదేళ్ల, సింగరేణి చీఫ్‌ లైజన్‌ ఆఫీసర్‌ మరియు పి.ఆర్‌.ఓ. శ్రీ బుడగం మహేష్‌ పాల్గొన్నారు.