కట్టుకున్న భార్యపై కక్ష పెంచుకున్న ఓ కసాయి భర్త ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
అనంతరం తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లాలోని కరీమాబాద్‌లో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే వ్యసనాలకు బానిసైన మృతుడు బండి భాస్కర్ రూ. 20 లక్షల అప్పు చేశాడు. భార్య పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని నిత్యం వేధింపులకు గురి చేశాడు.
భార్య డబ్బు తీసుకురావడం లేదన్న అక్కసుతో భాస్కర్..భార్య విజయ పై కక్ష పెంచుకున్నాడు.
భార్యపై ఆగ్రహంతో ఊగిపోతున్న భాస్కర్ భార్యపై పెట్రోలు పోసి..అనంతరం తనపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. దీంతో భార్యభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ఇదీ ఇలా ఉండగా గత 20 రోజుల క్రితం భర్తపై భార్య పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది.
అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఈ దారుణం జరిగిందని విజయ బంధవులు ఆరోపిస్తున్నారు.