ఓ మహిళను ముక్కముక్కలుగా నరికేసి నదీ తీరంలో పూడ్చిపెట్టారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాలో సోమవారం వెలుగు చూసింది.
సోనా మరాండి అనే మహిళ ఫిబ్రవరి 24న అదృశ్యమైనట్లు ఆమె కుమారుడు మనోజ్ హన్స్‌డా మార్చి 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న నదీ తీరంలో మహిళ కాలును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తీరానికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరాతీశారు.
నదీ తీర ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. మహిళ శరీరాన్ని ఆరు భాగాలుగా నరికి పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం వాటిని ఆస్పత్రికి తరలించారు.
ఆ మృతదేహం తన తల్లిదే అని మనోజ్ హన్స్‌డా పోలీసులకు చెప్పాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.