తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా: షర్మిల

210
Same name for YS Sharmila's party!

తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించేందుకు వైయస్ షర్మిల సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్ లో షర్మిల వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైయస్ రాజశేఖరెడ్డి హయాంలో ఎందరో మహిళలు మంత్రి పదవులను అలంకరించారని చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే మంత్రులుగా ఉన్నారన్నారు. ఆ ఇద్దరికీ కూడా ఐదేళ్ల తర్వాతే అవకాశం దొరికిందన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు సరైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం లేదని ఆమె దుయ్యబట్టారు.

తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని అన్నారు. ఇక్కడి మహిళలు ఎవరికీ తక్కువ కాదని చెప్పారు.

ఈ గడ్డపై పుట్టిన రాణి రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలిసిందేనని షర్మిల వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో ఉందని ఆమె అభివర్ణించారు. కానీ, ప్రస్తుత తెలంగాణలో స్త్రీలకు ఉన్న ప్రాతినిధ్యం చాలా తక్కువని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో అసమానతలు ఉన్నాయన్నారు. మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆమె విమర్శించారు.