
తెలంగాణలో కరోనా మహమ్మారి చాపాకింద నీరులా విజృంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలకు చేరింది.
ఇప్పటికే రాష్ట్రంలో ఎంతోమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు.
తాజాగా గిరిజన అభివృద్ధి శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ ఉదయం కోవిడ్ పరీక్షలను నిర్వహించారు.
ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్‌కు సత్యవతి రాథోడ్ బయలుదేరారు.
హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో ఆమె చేరినట్టు తెలుస్తోంది. తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.
కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో సత్యవతి రాథోడ్ హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు.