ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్

186
NTR Trust's blood donation drive

స్థానిక HMT హిల్స్ కమ్యూనిటీ హాల్‌ లో ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో, తెలుగు యువత రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ కొల్లి విజయ్ శేఖర్ నిర్వహించిన “లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్” లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎల్ రమణ పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంపు లో పాల్గొన్న వారికి సరిఫికేట్స్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అడుసుమిల్లి విజయ్, చిల్లంచర్ల గోపీ కృష్ణ, అధికార ప్రతినిధి నరేష్ ముదిరాజ్, కార్యనిర్వాహక కార్యదర్శులు స్టాలిన్, అవినాష్ రెడ్డి, నరేష్ యాదవ్, కార్యదర్శులు కోటి, కార్తిక్, ప్రణయిన తదితరులు పాల్గొన్నారు.