అభివృద్ధి పనులు తక్షణం పూర్తి చేయాలి – ఎంపీపీ చిలుక రవీందర్

357
General meeting

మండలంలో మనవూరు మన బడి సహా సీసీ రోడ్లు ఇతర అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసుకోవాలని ఎంపీపీ చిలుక రవీందర్ ఉద్బోధించారు.

ఆదివారం చొప్పదండి మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో డాక్టర్ బి అర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో ఎంపీపీ చిలుక రవీందర్ అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశం లో ఆయన మాట్లాడుతూ
పూర్తయిన పనులను వేగంగా రికార్డ్ చేసి ఇంజనీరింగ్ అధికారులు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.

మండలంలో దోమల మందు పిచికారి చేయించి విష జ్వరాలు అరికట్టేలా సర్పంచులు మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా సభలో పలు విషయాల పై ఆసక్తి కరమైన చర్చలు జరిగాయి.

వాడి వేడి గా మండల సర్వ సభ్య సమావేశం

మండల సర్వ సభ్య సమావేశంలో సభ్యులు మండలంలోని పలు సమస్యలు ప్రస్తావించడం తో సర్వ సభ్య సమావేశం వాడి వేడిగా జరిగింది.

రైతు బంధు అరకోరగా కొంతమందికి మాత్రమే ఇచ్చారని డ్రిప్ స్రింక్లర్ యూనిట్లు ఎందుకు కేటాయించడం లేదని, మహిళా సంఘాల్లో అర్హత ఉన్న మహిళలకు రెండు లక్షల రుణ సహాయం చేసే అవకాశం ఉన్నా మహిళా సంఘాల అధికారులు ఎందుకు శ్రద్ధ వహించి ఋణ వితరణ చేయడం లేదని ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి ప్రశ్నించారు.

పశువుల చికిత్సకు ఉపయోగించే ట్రైవిస్ లు గ్రామాలకు పంపినప్పటికి గ్రామ పంచాయతీలు బిగించడం లేదని తక్షణం బిగించెలా ఆదేశాలు ఇవ్వాలని సింగిరెడ్డి కృష్ణారెడ్డి కోరారు.

అసరా పెన్షన్ పొందుతున్న భర్త చనిపోయిన మహిళలకు వితంతు పెన్షన్లు వెంటనే ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణ లో మాత్రం కొర్రీలు వేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నదనీ గుమ్ములాపుర్
రాగంపేట ఎంపీటీసీ లు బత్తుల లక్ష్మి నారాయణ, సింగిరెడ్డి కృష్ణారెడ్డి లు ద్వజమెత్తారు.

వైద్య శాఖ అధికారులు గ్రామాల్లో క్లోరినేషన్ పరీక్షలు జరపడం లేదని, తక్షణం జర్పించాలని తోట కొటేష్ సభ దృష్టికి తీసుకు వచ్చారు.

రాగంపేట ఉప కేంద్రం డాక్టర్ ను గుంలపుర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎలా పంపిస్తారని రాగంపేట డాక్టర్ను రాగంపేట కు తింపి పంపాలని సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేయగా నెల రోజుల్లో పంపిస్తామని మెడికల్ ఆఫీసర్ రమాదేవి సమాధానమిచ్చారు.

మరణ ధృవీకరణ పత్రం నెల రోజులు దాటితే ఇవ్వమని పంచాయతీ కార్యదర్శులు సమాధానం చెప్పటం దారుణమని ఇంకుడు గుంతల బిల్లులు, మరుగు దొడ్ల బిల్లులు ఒకరికి బదులు మరొకరి ఖాతాల్లో ఎందుకు పడుతున్నాయని పలువురు సభ్యులు ప్రశ్నించారు.

MPP Chiluka Ravinder

మధ్యాహ్న భోజనపథకంను ఉపాద్యాయులు సరిగా పర్య వేక్షించక పోవడం తో మధ్యాహ్న భోజనం లో నాణ్యత ఉండడం లేదని, ఏ ఏ దినుసులు ఎంత ఇస్తున్నారో తుకం వేసే త్రాసు ఏ బడిలో లేదని , పప్పులు కూరగాయలు, నూనె దినుసులు తక్కువగా వేయడం తో బియ్యం సరిగా శుభ్రపరచక
పోవడం తో భోజనం నాణ్యత ఉండటం లేదని, కనీసం దినుసులు ఎంతవాడు తున్నారో ఏ పాటశాలల్లో కూడా రికార్డ్ లు లేవని మధ్యాహ్న భోజన పర్యవేక్షణ ఎప్పటినుండి మెరుగు పరుస్తారో సమాధానం చెప్పాలని ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి పట్టుబట్టారు.

రాగంపేటలో అంగన్వాడి టీచర్ ఏ రోజు సరిగా బడి కి రావడం లేదని పిల్లలకు ప్రి స్కూల్ విద్య జరపడం లేదని అంగన్ వాడి పర్యవేక్షకులు పర్యవేక్షణ సరిగా జరపడంలేదని సింగిరెడ్డి కృష్ణారెడ్డి ఆరోపించారు.
పని చేయని ప్రభుత్వ సిబ్బంది పై చర్య తీసుకోవాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు.

రాగంపేట అర్ణకొండల్లో రెండు ఫేజుల విద్యుత్ లైన్లను మూడు ఫెజుల విద్యుత్ లైన్లు గా మార్చే లా తీర్మానం చేయాలని సింగిరెడ్డి కృష్ణారెడ్డి ప్రతి పాధించగా సభ్యులు తోట కోటేష్, కూకట్ల తిరుపతి బలపరచగా సభ ఏకగ్రీవంగా తీర్మానించారు.

పలు అంశాలపై సభ్యులు పలు తీర్మానాలు చేశారు. పలు అభివృద్ధి పనులు చేయాలని ఈ సమావేశం లో తీర్మానించారు.

సమావేశంలో ఎంపిడిఓ ఇనుకొండ స్వరూప రాణీ, పంచాయతీ రాజ్ డీ ఈ, ఏ ఈ, సర్పంచ్లు కొత్తపల్లి రామకృష్ణ, పెద్ది శంకర్, ఎంపీటీసీ సభ్యులు, కూకట్ల తిరుపతి, కట్టేకోల తార, వైద్య, విద్య, విద్యుత్ మిషన్ భగీరథ, పశు సంవర్తక తదితర మండల స్థాయి అధికారులు, కార్యాలయ సిబ్బంది నారోత్తం రెడ్డీ, హరి కృష్ణ, శ్రీనివాస్ లు పాల్గొన్నారు