ప్రభుత్వ ధోభీ కాంట్రాక్టులు రజకులకె కేటాయించాలి

127
Dhobi

●నూతన జిల్లా & పట్టణ కమిటీ నియామకం
●మంచిర్యాల పట్టణ అధ్యక్షులుగా కె.రాజేంద్రప్రసాద్

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ లో 12-2-2023 ఆదివారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు సంగెం లక్ష్మణ్ మరియు జిల్లా ఉద్యోగ విభాగం అధ్యక్షులు దొడ్డిపట్ల శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్యనాయకుల సమావేశానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోడిపుంజుల చంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర కార్యదర్శి ముక్కెర రాజేశం,రాష్ట్ర గౌరవ యూత్ అధ్యక్షులు సంగెపు ఎల్లన్న,జిల్లా గౌరవ అధ్యక్షులు కంచర్ల కొమురయ్య హాజరయ్యారు.

రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ బట్టలు ఉతికే కాంట్రాక్టు కార్పోరేట్ సంస్థలకు ఇవ్వడంవల్ల రజకులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కావున తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వివిధ ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టు రజక కులస్తులకు కేటాయించే విధంగా ఒక జీవోను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు గ్రహీత ముక్కెర రాజేశం గారిని శాలువాతో సన్మానించిన మంచిర్యాల జిల్లా కమిటీ.

Dhobi 2

నూతన నియామకంలో బాగంగా
◆మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా కోలిపాక రమేష్
◆జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తంగళ్ళపల్లి తిరుపతి
◆జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రాసమల్ల కుమార్
◆మంచిర్యాల పట్టణ అధ్యక్షులుగా కటుకూరి రాజేంద్రప్రసాద్
◆ మంచిర్యాల టౌన్ ఉపాధ్యక్షులుగా చంద్రగిరి చంద్రమౌళి లను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు సంగెం లక్ష్మణ్ వారికి నియామకపత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ మాపై నమ్మకంతో అప్పజెప్పిన భాధ్యతను సక్రమంగా అమలు చేస్తామని అదేవిధంగా రాష్ట్ర మరియు జిల్లా కమిటీ పిలుపు మేరకు పనిచేస్తామని అన్నారు. జిల్లా మరియు రాష్ట్ర కమిటీ నూతన సభ్యులకు అభినందనలు తెలియజేశారు.

ఈ సమావేశంలో తాడూరి శంకర్,అరటిపండ్ల శంకర్, పారిపల్లి మల్లయ్య, అన్నారం సత్యనారాయణ, కటుకూరి ముత్తయ్య, గుండ శంకర్, గుండ తిరుపతి, గుండ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.