ఓదెల మండలంలో ఆలయ ఫౌండేషన్ ఉచిత మెడికల్ క్యాంపు

227
Alaya foundation

ఓదెల మండలం గూడెం గ్రామం పెద్దపల్లి జిల్లా నందు ఈ రోజు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్ హాస్పిటల్ సౌజన్యం తో శ్రీ పరికిపాండ్ల నరహరి IAS సూచన మేరకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.

ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ P. నరహరి IAS గారు మన పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వాస్తవ్యులు విద్య, వైద్యం, ఉపాధి కార్యక్రమం నందు పది సంవత్సరాలనుండి సేవ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం పార్కిపండ్ల నరహరి IAS గారు మధ్య ప్రదేశ్ రాష్టం లొ ప్రిన్సిపాల్ సెక్రటరీ అండ్ కమీషనర్ గా సేవలు అందిస్తున్నారు.

ఈ మెడికల్ క్యాంపు నందు సుమారుగా 540 మంది పేషెంట్స్ కి బీపీ, షుగర్ టెస్ట్ నిర్వహించి పది రోజులు సరిపడా మందులు ఇవ్వడం జరిగింది.

వన్ హాస్పిటల్ తరపున డాక్టర్స్ జనరల్ ఫిజిషియన్,గేనేకలోజిస్ట్, ఆర్థో ఫిజిషియన్ అండ్ స్టాఫ్ నర్స్ వారి సేవలు గ్రామ ప్రజలకు అందించడం జరిగింది. అదే విదంగా పేషెంట్స్ కి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఉచితంగా ఆలయ ఫౌండేషన్ తరపున సేవ చేయడం జరుగుతుంది.

ఈ ఉచిత శిబిరం లొ ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ CEO మిట్టపల్లి రాజేంద్ర కుమార్ గారు, ఫౌండేషన్ సభ్యులు గుణ సాగర్,పరికిపండ్ల సుమంత్, రాజేష్ మంతెన, మహేష్ పటేల్, అనిల్ పటేల్, వెంకట్ స్వామి, బొందన్న, పరికిపండ్ల రామ్ గార్లు పాల్గొన్నారు.