నాగలి పట్టిన ఐఏఎస్

387
parikipandla narahari

సంక్రాంతి సంబరాలను రైతులు, బాల్య స్నేహితుల మధ్య జరుపుకున్న ఐఏఎస్ పరికి పండ్ల నరహరి  సెక్రెటరీ మధ్య ప్రదేశ్

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని తమ స్వగ్రామం ఐన పెద్దపెల్లి జిల్లా బసంత్ నగర్ వచ్చిన నరహరి రైతులతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. స్వయంగా తాను పొలంలో దుక్కి దున్ని నాట్లు వేశారు. రైతుల కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక అని, వారిని గౌరవించి కాపాడు కోవాలి అని ఉద్బోధించారు. మన దేశం వ్యవసాయాధారిత దేశం, మన కల్చర్ అగ్రిక కల్చర్. ఆకల్చర్ ను కాపాడు కోవాలి అన్నారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం ఆహార కొరత. అనారోగ్యం లాంటి అనేక సమస్యలకు ఆధునిక వ్యవసాయం పరిష్కారం చూపుతుంది. యువత పల్లెల వైపు వ్యవసాయాధారిత ఉత్పత్తుల వైపు దృష్టి సారించాలి. వాణిజ్య పంటలను పండించడం వల్ల  రైతులు ఆర్థికంగా నిలదొక్కు కొగలుగుతారు. అప్పుడే రైతు రాజు అవుతాడు. దేశం స్వావలంబన దిశగా ఎదుగుతుంది అని తెలిపారు.

IAS Parikipandla narahari

ఈ సంక్రాతి మార్పుకు చిహ్నం. అది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రక్రుతి వెడుకైన సంక్రాంతి అందరూ అనందోత్సలతో జరుపుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, బాల్య స్నేహితులు టి.రమేష్ బాబు , రాజేందర్, మల్క రామస్వామి వినయ్ సుమంత్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.