తీన్మార్ మ‌ల్ల‌న్న మార్నింగ్ న్యూస్‌

209

కోదాడ‌ బాలాజీ న‌గ‌ర్‌లోని డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల ద‌గ్గ‌ర‌ నుంచి తీన్మార్ మ‌ల్ల‌న్న మార్నింగ్ న్యూస్ లైవ్ కొన‌సాగింది.

ఊరికో కోడి, ఇంటికో ఈక మాదిరిగా

ఊరికో కోడి, ఇంటికో ఈక మాదిరిగా ఆడోటి, ఆడోటి క‌ట్టి రెండుసార్లు టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుక్కంది.

ఐదేళ్ల నుంచి ఒక్క‌రికి ఒక ఇళ్లిచ్చింది లేదు. ఒక‌రితో పాలు పొంగించిందీ లేదు.

తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో క‌ట్టిన ఇళ్ల జాబితాను మ‌ల్ల‌న్న వివ‌రించారు.

ఇది ఆర్‌టీఐ (రైట్ టు ఇన్ఫ‌ర్మేష‌న్ యాక్ట్‌) కింద ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన వ‌చ్చిన స‌మాచార‌మ‌ని చెప్పారు.

42 వేల 420 ఇళ్లు మాత్ర‌మే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం క‌ట్టింద‌ని చెప్పారు.

ప్ర‌భుత్వంపై ప్ర‌జా వ్య‌తిరేక‌త‌

ఈ డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల ద‌గ్గ‌రికి మ‌హిళ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చారు. ఇస్తామంటున్నారు కానీ ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌జ‌లు అన్నారు.

ఇస్తం ఇస్తం కాస్త ఓపిక ప‌ట్టండ‌ని నాయ‌కులు చెబుతున్నార‌ని చెప్పారు.

ఓట్ల స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తులు అడుగుతారు త‌ర్వాత ప‌ట్టించుకోర‌ని ఆ మ‌హిళ‌ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మార్నింగ్ న్యూస్ వివ‌రాలు

విశాఖ ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేటు ప‌రం చేయ‌డంపై మ‌ల్ల‌న్న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లీడ‌ర్లు స‌మావేశానికి డుమ్మా కొట్ట‌డంతో అలిగిన మంత్రి కేటీఆర్‌.

ప‌ట్ట‌భ‌ద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీఆర్ఎస్ నేత‌లకు ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త‌.

ఇన్ని రోజులు ఎక్క‌డికి వెళ్లార‌ని ప్ర‌శ్న‌. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బోగ‌స్ ఓట్లు. ఈ దొంగ ఓట్ల‌ను ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి త‌యారు చేశార‌ని మ‌ల్ల‌న్న అన్నారు.

ఈ దొంగ ఓట్ల‌పై చౌటుప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో మ‌ల్ల‌న్న ఫిర్యాదు చేశారు. ఇంకా ఎన్నో వార్తా విశేషాల‌ను మ‌ల్ల‌న్న వివ‌రించారు.