రెడ్ జోన్లోని కాంట్రాక్టు కార్మికులకు వేతనంతో పాటు 8వేలు చెల్లించాలి

568
Ramagundam MLA

రెడ్ జోన్లో ఉన్న ఎన్టీపిసి కాంట్రాక్టు కార్మికులకు వేతనంతో పాటు 8వేలు ప్రోత్సాహకంగా చెల్లించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం ఆయన ఎన్టీపీసీ ఇడి రాజ్ కుమార్ తో జ్యోతిభవన్ లో సమావేశం అయ్యారు. అనంతరం వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు ప్రకటించిన విధంగా నగదు ప్రోత్సహం ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను కుడా అత్యవసర సేవ విభాగంగా గుర్తించాలన్నారు. అదే విధంగా ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో లాక్ డౌన్ సమయం లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులు, రెడ్ జోన్ కారణంగా విధులకు హజరు కాలేక పోయిన కాంట్రాక్టు కార్మికులకు ఈ నెల వేతనంతో పాటు 8వేలు అదనంగా ప్రోత్సాహకంగా అందించాలన్నారు.

NTPC Contract Labour

ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు ఎన్.వి.రమణరెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, ఎజిఎం హెస్ఆర్ అనిల్ కుమార్, ఎజిఎం రఫీకుల్ ఇస్తాం పాల్గొన్నారు.