కార్మికుని కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కోరుకంటి

510
MLA chandar

పేద కాంట్రాక్టు కార్మికుని కుటుంబానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అండగా నిలిచారు. గోదావరిఖని పట్టణంలోని వినోభానగర్ కు చెందిన కోడూరి స్వామి శుక్రవారం రాత్రి అడ్రయాలలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ శుక్రవారం గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి చేరుకుని కుటంబసభ్యులను ఓదార్చారు. కుటంబ సభ్యులకు అండగా ఉంటానని భరోస ఇచ్చారు.

పని స్థలంలో ప్రమాదం జరిగిన వివరాలను తోటి కార్మికుల ద్వారా తెలుసుకున్నారు. RG – 3 సింగరేణి యాజమాన్యం, సదరు కాంట్రాక్టర్ తో చర్చలు జరిపి కాంట్రాక్టు కార్మికుని కుటుంభానికి 5లక్షల ఎక్స్ గ్రేషియా, మృతుని కుటుంబంలో ఇద్దరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేలా కృషి చేశారు.

contract labour

శుక్రవారం గోదావరిఖని సింగరేణి ఆసుపత్రిలో కాంట్రాక్టు కార్మికుని కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు సరైన రక్షణ కల్పించాలని అన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు రక్షణ లేని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కాంట్రాక్టు కార్మికులకు అండగా నిలుస్తామని, వారి సమస్యల సాధన కృషి చేస్తానని చెప్పారు. సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల రక్షణ పట్ల శ్రద్ధ చూపాలన్నారు. కాంట్రాక్టు కార్మికుని మృతి విషాదకరమని, వారి కుటంబాన్ని అన్ని విధాలుగా అదుకుంటామన్నారు.

ఎమ్మెల్యే వెంట నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, టిబిజికెఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, కార్పోరేటర్ ఇంజపురి పులిందర్, నాయకులు పి.టి.స్వామి, గండ్ర దామోదర్ రావు, కనకం శ్యాంసన్, జే.వి. రాజు, మండ రమేష్, వడ్డేపల్లి శంకర్, వెంకటేష్ తదితరులున్నారు.