రేపే టి.ఆర్.ఎస్ ఆవిర్భావ దినోత్సవం – ఇంటింటా కెసిఆర్ రక్షణ రేఖ

541
Telangana State
  • టీఆర్ఎస్ అలుపెరుగని పోరాట ఫలితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం
  • టిఆర్ఎస్ శ్రేణులు ఇళ్లపై గులాబీ జెండాలను ఎగురవేయాలి
  • మహిళలు కేసీఆర్‌ రక్షణ రేఖగా ఇళ్ల ముందు ముగ్గులు పెట్టాలి
  • రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ పిలుపు

 

నీళ్లు నిధులు నియామకాల సాధన కోసం, సకల జనులను ఏకం చేసి ఉద్యమంలో భాగస్వామ్యులుగా చేస్తూ టీఆర్ఎస్ పార్టీ,కేసీఆర్‌ గారు సాగించిన అలుపెరుగని పోరాట ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001సంవత్సరంలో ఏప్రిల్ 27 తేదీన ఉద్యమ ధీరుడు సిఎం కెసిఆర్ గారు టిఆర్ఆర్ పార్టీని స్దాపించారన్నారు.

కెసిఆర్ రక్షణ రేఖ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రం లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉద్యమ నాయకులు అందరూ తమ ఇళ్లపై టీఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మన ఇళ్లముందు కళ్లాపి చల్లడం, ముగ్గులు పెట్టడం, మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమన్నారు. కరోనా వ్యాప్తి జరుగుతున్న ఈ సందర్భంలో రామగుండం నియోజకవర్గంలోని మహిళా సోదరీమణులందరూ కరొనా వైరస్ మన ఇళ్లలోకి, మనదరికి చేరనియకుండా ఉండేందుకు కెసిఆర్ రక్షణ రేఖ పేర తమ ఇళ్ల ముందు కళ్లాపి చల్లి ముగ్గులు పెట్టాలి అని అన్నారు. మహిళలు కరోనా నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ ఇళ్ల ముందు ముగ్గులు పెట్టాలని తెలిపారు.

విజయమ్మ ఫౌండేషన్  ద్వారా

కరోనా వ్యాప్తి మూలంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న కిడ్నీ వ్యాధీ బాధితుల కోసం టీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమ కారులు విజయమ్మ ఫౌండేషన్ సభ్యులు రక్తదానం చేయాలన్నారు. నిరుపేదల సహాయార్థం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా నిత్యావసరాల పంపిణీ అన్నదాన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, నిరుపేదలకు సేవ చేసేందుకే విజయం ఫౌండేష్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని శ్రీ నియంత్రణ పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట మేయర్ బంగి అనిల్ కుమార్ పాల్గొన్నారు.