తెలంగాణకు నిధులు తేవడంలో బీజేపీ నేతలు విఫలం: మంత్రి వేముల

140
prashant redy trs

తెలంగాణకు నిధులు తేవడంలో బీజేపీ నేతలు విఫలం అయ్యారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. బాన్సువాడలో రూ. 15.98 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాంకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ అంటే భారతీయ ఝటా పార్టీ అని మంత్రి వ్యాఖ్యానించారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి ప్రశాంత్ రెడ్డి మరోసారి సవాల్‌ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రూ.2,016 పెన్షన్‌లో కేంద్రం ప్రభుత్వ వాటా 200 రూపాయల కంటే మించితే తాను రాజీనామాకు సిద్ధమని మంత్రి సవాల్‌ విసిరారు. తన సవాలు స్వీకరించి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.