చిన్న పంచాయతీలకు కూడా రూ.5లక్షల నిధులు: మంత్రి ఎర్రబెల్లి

119
erraballi TRS

తెలంగాణలో చిన్న గ్రామ పంచాయతీలకు కూడా రూ.5లక్షల నిధులు విడుదల అవుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉపాధి హామీ పథకం లో భాగంగా అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ నూతన సంవత్సర కేలండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలు పల్లెల రూపు రేఖలు మర్చాయని అన్నారు.

గ్రామాలకు కేంద్ర నిధులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.308 కోట్లు విడుదల అవుతున్నాయని పేర్కొన్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాల నిర్మాణాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు.

రైతుల సౌకర్యార్థం కల్లాలు, రైతు వేదికల నిర్మాణం జరిగిందన్నారు. గ్రామాల్లో నిరంతర పారిశుద్ధ్య పనులు జరగడంతో గ్రామాల్లో రోడ్లన్నీ శుభ్రంగా ఉన్నాయన్నారు. గ్రామాలకు ట్రాక్టర్లు, ట్రాలీ లు, నీటి యాంకర్లు, శుద్ధి చేసిన మిషన్ భగీరథ మంచినీటిని ఇంటంటికి నల్లా ల ద్వారా అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.