పోయిన పర్స్.. పోస్ట్‌లో ఇంటికొచ్చింది

1322
man-loses-wallet-and-11-days-later-gets-it-by-post

రోడ్డు మీద వెళ్తుంటే ఓ 10 నోటో.. 100 నోటో కనిపిస్తే ఏం చేస్తారు. కొంతమందయితే.. వెంటనే అటూ ఇటూ చూసి దాన్ని మూడో కంటికి కూడా తెలియకుండా లటక్కున జేబులో వేసుకొని వెళ్తారు. మరి కొంతమంది చుట్టు పక్కన చూసి ఎవరి డబ్బులైనా కింద పడ్డాయో లేదో తెలుసుకుంటారు. ఇక.. అక్కడ ఎవరూ లేకపోతే.. చేసేదేంలేక దాన్ని జేబులో వేసుకొని వెళ్తారు. కాని.. విచిత్రంగా ఓ వ్యక్తి మెట్రో ట్రెయిన్‌లో పోగొట్టుకున్న పర్స్ ఏకంగా పోస్ట్‌లో ఇంటికి వస్తే ఎలా ఉంటది. అందులో ఉన్న ఏ వస్తువూ మిస్ కాకుండా ఉంటే ఇంకా ఎలా ఉంటది. దాన్నే మన భాషలో అదృష్టమంటారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.



 

“సెంట్రల్ సెక్రటేరియట్ నుంచి లజ్‌పత్ నగర్‌కు మెట్రో ట్రెయిన్‌లో వెళ్తున్నాను. లజ్‌పత్ నగర్‌లో ట్రెయిన్ దిగాక జేబు చెక్ చేస్తే పర్స్ కనిపించలేదు. వెంటనే మెట్రో రైల్వే స్టేషన్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాను. ట్రెయిన్ లాస్ట్ స్టాప్‌లో ఆగాక.. పర్స్ వెతకాలని చెప్పాను. చివరకు పర్స్ ట్రెయిన్‌లో దొరకలేదని సిబ్బంది చెప్పారు. దీంతో పర్స్ మీద ఆశలు వదిలించుకున్నాను.

ప‌ర్స్ పోగొట్టుకున్న 11 రోజుల త‌ర్వాత‌.. నేను ఇంట్లో ఉండగా.. ఇండియా పోస్ట్ నుంచి ఓ పార్సిల్ వచ్చింది నాకు. దాన్ని తీసి చూశాక నేను షాక్ అయ్యాను. అందులో నేను పోగొట్టుకున్న పర్స్ ఉంది. దాంతో పాటు ఓ లెటర్ ఉంది. దాంట్లో ఏం రాసి ఉందంటే… ఢిల్లీ మెట్రోలో నీ పర్స్ నాకు దొరికింది. దాన్నే నీకు పంపించాను. ఇంకోసారి కేర్‌ఫుల్‌గా ఉండు మిత్రమా. అంటూ సిద్ధార్థ్ అనే వ్యక్తి లెటర్‌లో వివరించాడు. ఇక.. నా పర్స్‌లో ఉన్న దేన్నీ ముట్టుకోకుండా.. ఉన్నది ఉన్నట్లు పంపించిన ఆ వ్యక్తికి నిజంగా నేను రుణపడిఉంటాను..” అని ప‌ర్సును పోగొట్టుకున్న గుర్‌ప్రీత్ తెలిపాడు.


 

ఎవరికి ఏమైతే నాకేంటి.. ఎవరి పర్సు పోతే నాకేంది.. నాకు దొరికింది కదా.. అంటూ నీతులు చెప్పేవాళ్లు ఉన్న ఈ రోజుల్లో పర్సును పోస్ట్‌లో పంపంచి మానవత్వాన్ని చాటుకున్న ఆ వ్యక్తికి నిజంగా హేట్సాఫ్.