ప్రజల అవసరాలకు సింగరేణి స్థలాన్ని ఇవ్వండి

273
make vittal nagar singareni park in to use

సెక్టర్ -2 విఠల్ నగర్ లోని పార్కు కరోనా కారణంగా లాక్ డౌన్ సమయంలో బంద్ చేయడం వలన ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది. పిల్లలతో కలిసి ఇంటిల్లిపాది అందరూ ఆహ్లాదంగా గడుపుకోడానికి వీల్లేకుండా నిరుపయోగంగా ఉన్న పార్క్ ను తెరిపించి ఉపయోగంలోకి తీసుకు రావాలని 12 వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత విజ్ఞప్తి చేయడం తో స్పందించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ బంగి అనిల్ కుమార్ RG1 GM కల్వల నారాయణ గారితో కలిసి ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అలాగే 5ఇంక్లైన్ మజీద్ ముందు గల ఖాళి ప్రదేశాన్ని రామగుండం కార్పోరేషన్ లోని 12వ డివిజన్ కు కేటాయించేలాగా చర్యలు తీసుకోవాలని Rg-1GM గారిని కోరడం జరిగింది.

RG -1 Gm కల్వల నారాయణ కి 5ఇంక్లైన్ పట్టణ అధ్యక్షుడు ఆద్వర్యంలో 12 వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత, 33 వ డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ , 34వ డివిజన్ కార్పొరేటర్ జంజీపెళ్లి మౌనిక, కో ఆప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డిలతో కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

MLA Korukanti chandar

సింగరేణి యాజమాన్యం త్వరగా స్థలం కేటాయించినట్లయితే ఇక్కడ ఒక మంచి కమ్యూనిటీ హాలు మరియు ఒక సీనియర్ సిటిజన్ హాల్ ను ప్రజల కొరికమేరకు తప్పకుండా కట్టిస్తామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ స్థలంలో ఒక ఓపెన్ జిమ్ ని ఏర్పాటు చేస్తే మా డివిజన్ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారని 3 డివిజన్ ల కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు.

12 వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత మేయర్ బంగి అనిల్ కుమార్ గారికి డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 12 వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత, 33 వ డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్, 34 వ డివిజన్ కార్పొరేటర్ జంజీపెళ్లి మౌనిక, కోప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్ నారదాసు మారుతి, దీటి బాలరాజు, ముప్పు సురేష్, అరెళ్లి కిష్టస్వామి, పసులబాపు, సురేష్ భవాని, పోశం భవాని, సందవేన కుమార్, దుస్స వెంకటేశ్వర్లు , ఆరే శ్రీనివాస్, గుడెపు రమేష్, హరికృష్ణ , గుండపు రవిందర్ , md సర్వర్, మహేందర్, గుండబోయిన శ్రీనివాస్, చిక్కుడు సది, కుంచమ్ శ్రీకాంత్ , ప్రదీప్, రమేష్ ,బోయిని నాగరాజు , అనవేని రమేష్ , ప్రభాకర్ రెడ్డి , సిద్ధ సమ్మయ్య ఆనవేనా సంధ్య , సునీత , కవిత , లత తదితరులు పాల్గొన్నారు.