వంట గ్యాస్ ధరలను తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 1.46 తగ్గించిన ఐవోసీఎల్ సబ్సిడీయేతర సిలిండర్ ధరను మాత్రం ఏకంగా రూ.30 తగ్గించింది. తగ్గిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.
మూడు నెలలుగా తగ్గుతున్న గ్యాస్ ధరలు
తాజా తగ్గింపుతో 14.2 కిలోల రాయితీ సిలిండర్ ధర రూ. 493.53కు లభిస్తుంది. ధరలు తగ్గడం ఇది వరుసగా మూడోసారి. గతేడాది డిసెంబరు 1న రూ.6.52 తగ్గించిన ఐవోసీఎల్ జనవరి 1న రూ.5.91 తగ్గించింది. ఇప్పుడు రూ.1.46 తగ్గించింది.14.2 కిలోల సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.30 తగ్గింపుతో ప్రస్తుతం దాని ధర రూ. 659కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడమే ఇందుకు కారణమని ఐవోసీఎల్ తెలిపింది. డిసెంబరులో రూ.133 తగ్గించిన ప్రభుత్వం జనవరి 1న రూ.120 తగ్గించింది. ఇప్పుడు రూ. 30 తగ్గించింది.