పెళ్లి జరిగినప్పటికీ ఓ వివాహిత ప్రియుడితో కలిసి ప్రేమ వ్యవహారం ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూనే ఉంది.
దీంతో కథ అడ్డం తిరగడంతో ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందారు.ఈ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.
జిల్లాలోని నిడదవోలు మండలంలో ప్రియుడితో కలిసి ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందారు.
ఏలూరు నగరానికి చెందిన షేక్ నాగూర్తో కుసుమ నాగసాయి కుమారికి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది.
ఈ ప్రేమ వ్యవహారం కొనసాగుతుండగానే యువతి తల్లిదండ్రులు ఆమెని నిడదవోలు మండలం తాళ్లపాలెంకి చెందిన శ్రీనివాస్కి ఇచ్చి పెళ్లి చేశారు.
2014లో పెళ్లి జరిగినప్పటికీ నాగసాయి కుమారి తన ప్రియుడు నాగూర్తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూనే ఉంది. భార్య వ్యవహారంపై కొద్దికాలంగా భర్త శ్రీనివాస్కు అనుమానం వచ్చింది.
తాజాగా వీరిద్దరూ తాళ్లపాలెంలో నాగూర్ బంధువులకు చెందిన ఇంట్లో ఉండగా… భర్త శ్రీనివాస్ కొంతమంది యువకులతో కలిసి వెళ్లి భార్య, ఆమె ప్రియుడు నాగూర్పై దాడి చేశారు.
వారిద్దర్నీ అక్కడి నుంచి తీసుకెళ్లి శెట్టిపేటలోని శ్రీనివాస్ బంధువుకు చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నిర్బంధించారు.
ఆ గదిలో దొరికిన ఎలుకల మందును వీరు ఇరువురు తిని చనిపోయినట్లు సమాచారం.
నాగసాయి కుమారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.