పలు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. దేవతలు కొలువుండే భూమిగా పేరుగాంచి కేరళ కూడా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.
కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న కేరళపై కాంగ్రెస్, బీజేపీలు కన్నేయడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేరళ రాష్ట్రంపై బీజేపీ గురి పెట్టడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
మరోవైపు కేరళ నుంచే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన శ్రీధరన్ బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు.
పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే సీఎం అభ్యర్థిగా తాను బరిలోకి దిగేందుకు సిద్ధమని శ్రీధరన్ ప్రకటించారు.
మరోవైపు పరుగుల రాణిగా మన దేశ కీర్తి ప్రతిష్టలను చాటిన పీటీ ఉష కూడా బీజేపీలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
బీజేపీలో చేరుతున్నట్టు పీటీ ఉష మాత్రం ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.