పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ గా గణేశుడు

790
lord ganesh in police dress

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ‘హిట్‌ అండ్‌ రన్‌ కేసు-2002’లో విచారణ జరిపి మంచి పేరు తెచ్చుకున్న పోలీస్‌ ఇన్స్‌పెక్టర్ రాజేంద్ర కానె ప్రస్తుతం మహారాష్ట్రలోని విలే పార్లె పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నేరాలు, శిక్షలపై అవగాహన కల్పిస్తూ ఆయన ఇప్పటివరకు 150 షార్ట్‌ ఫిలిమ్స్‌ కూడా తీశారు. వాటిల్లో కొన్నింటిని సినిమా హాళ్లలోనూ ప్రదర్శించి చూపుతారు.




 

ప్రజల్లో పలు విషయాల పట్ల అవగాహన కల్పించడంలో ఎల్లప్పుడూ ఉత్సాహాన్ని చూపే ఆయన.. వినాయక చవితి సందర్భంగా ఈ సారి పోలీసు వేషంలో గణేశుడి విగ్రహాన్ని రూపొందించి ఆకట్టుకున్నారు. తన ఇంటి వద్ద విలే పార్లె పోలీస్ స్టేషన్‌ ఆకృతిలో వినాయక మండపాన్ని నిర్మించి, అందులో గణేశ విగ్రహాన్ని ఉంచారు.

ఇన్స్‌పెక్టర్‌లా ఖాకీ దుస్తులు వేసుకుని, పోలీసు అధికారి కుర్చీలో గణేశుడు కూర్చున్నట్లు ఆ విగ్రహం ఉంది. పోలీస్ స్టేషన్‌లో గోడలపై నాయకుల ఫొటోలు ఉంచినట్లే, ఈ మండపంలోనూ వారి ఫొటోలు పెట్టారు. గణేశుడు కూర్చున్న కుర్చీకి కుడి వైపున కాగాగారం ఉన్నట్లు అందులో దొంగలని ఉంచినట్లు ఈ మండపం ఉంది. దీన్ని చూసేందుకు స్థానికులు ఉత్సాహం చూపించారు. పోలీసులా ఉన్న గణేశుడితో ఫొటోలు దిగేందుకు స్థానిక పోలీసులు కూడా ఉత్సాహం చూపారు. తాజాగా, ఈ వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. కాగా, రాజేంద్ర కానె షార్ట్‌ ఫిలిమ్స్‌ ద్వారానే కాకుండా పలు కార్యక్రమాల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు పలు విషయాల్లో అవగాహన కల్పిస్తారు.