ఐశ్వర్యరాయ్‌తో లాలూ కుమారుడి పెళ్లి

730
lalu son marriage with aishwarya rai

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన పెళ్లి మే 12న ఐశ్వర్యరాయ్ అనే యువతితో జరగనుంది. తల్లి రబ్రీ దేవి ఎంపిక చేసిన అమ్మాయినే తేజ్ ప్రతాప్ పెళ్లి చేసుకోబోతున్నారు. పాట్నాలో జరిగే వీళ్ల పెళ్లికి 10 వేల మంది హాజరవనున్నారు. ఇందులో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత సోనియాగాంధీతోపాటు వందల మంది వీవీఐపీలు హాజరు కానున్నారు.



 

గత నెలలోనే ఐశ్వర్య తల్లిదండ్రులను కలిసి తర్వాత రబ్రీ దేవే ఎంగేజ్‌మెంట్, పెళ్లి తేదీలను నిర్ణయించారు. పాట్నాలోనే హైస్కూల్ వరకు చదువుకున్న ఐశ్వర్య.. తర్వాత ఉన్నత చదువులు మొత్తం ఢిల్లీలో పూర్తి చేసింది. ఐశ్వర్య ఎవరో కాదు.. బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలే. ఆమె తండ్రి చంద్రికా రాయ్ కూడా బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. పాట్నాలోని మౌర్య హోటల్లో తేజ్ ప్రతాజ్, ఐశ్వర్య ఎంగేజ్‌మెంట్ జరగనుండగా.. పెళ్లి మే 12న పాట్నా వెటిరినరీ కాలేజ్ కాంపౌండ్‌లో జరగనుంది.