కోదండరాం కు చెక్ – 29 న గొల్లకురుమల సభ

645
golla kuruma sabha on 29th

గొల్లకురుమల బహిరంగ సభను చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ తెలిపారు. అఖిల భారత యాదవ మహసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం నాగోలులో జరిగింది. ఈ నెల 29న పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న సభ ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్య అతిథిగా తలసాని మాట్లాడుతూ.. గొల్ల, కురుమల అభివృద్ధికి గతంలో ఏ ప్రభుత్వమూ మేలు చేయలేదన్నారు.



 

కులవృత్తిదారులను ప్రోత్సహించటం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్న మంచి సంకల్పంతో సీఎం కేసీఆర్‌ రూ.5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ, పశుగ్రాసం, దాన పంపిణీ చేశారన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత సభను భారీ స్థాయిలో నిర్వహిస్తామన్నారు. యాదవులకు రాజ్యసభ, కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశంకు ఎమ్మెల్సీ ప్రకటించి తమను రాజకీయంగా కూడా సీఎం కేసీఆర్‌ మంచి గుర్తింపునిస్తున్నారన్నారు. సభను విజయవంతం చేసేందుకు ఈ నెల 9 నుంచి 18 వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి గొల్ల కురుమలను సమాయత్తం చేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు