కోమటిరెడ్డి, సంపత్ ల బహిష్కరణ చెల్లదు : హైకోర్టు

342
komati-reddy-sampath-get-relief-highcourt

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. వారి శాసనసభ సభ్యత్వాల రద్దు చెల్లదని తీర్పు ఇచ్చింది హైకోర్టు. ఐదేళ్లు వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని ఆదేశించింది. అదే విధంగా గతంలో ఉన్న అన్ని బెనిఫిట్స్ వర్తింపజేయాలని కోరింది. ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని ఆదేశించింది కోర్టు. అసెంబ్లీ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను కూడా రద్దు చేసింది. ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన రిపోర్ట్ ను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు 169 పేజీల తీర్పును వెల్లడించింది హైకోర్టు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల తీరుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భావిస్తే.. ఈ తీర్పు అడ్డంకి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.