రాంగ్ రూట్‌లో వెళ్తున్న బస్సు డ్రైవర్‌..బుద్ది చెప్పిన మహిళ

293

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించొద్దని పోలీసులు కోడైకూస్తున్నా.. వాహనదారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా రాంగ్ రూట్‌లో వస్తున్న ఓ బస్సు డ్రైవర్‌కు ఓక మహిళ దిమ్మతిరిగేలా చేసింది. కేరళలోని ప్రధాన రహదారిపై వాహనాలు వేగంగా వెళ్తున్నాయి, అయితే ఓ బస్సు డ్రైవర్ రహదారి మధ్యలో ఉన్న లైన్‌ను దాటి కుడివైపుకు వచ్చాడు.

కుడివైపు నుంచి తన మార్గంలో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళ మాత్రం రాంగ్‌రూట్‌లో వస్తున్న ఆ బస్సుకు అడ్డంగా వెళ్లింది. స్కూటీని బస్సు ముందే నిలిపి ఉంచింది. దీంతో తన తప్పును తెలుసుకున్న బస్సు డ్రైవర్ తన మార్గంలో వెళ్లాడు. ఇప్పుడు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోను దిఘోస్ట్‌రైడర్31 ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. ఆ మహిళపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.