కల్తీలపై కరీంనగర్ టాస్క్ ఫోర్స్ దాడులు

336
Karimnagar Task Force attacks on adulteration

ఐదు షాప్ లపై దాడులు…
ఆయిల్,పసుపు,కారం శాంపిల్స్ సేకరణ…ఫుడ్ సేఫ్టీ లాబొరేటరీ కి తరలింపు…
నివేదిక ఆధారంగా చర్యలు..పాల్గొన్న ఫుడ్ ఇన్స్పెక్టర్…



కరీంనగర్ లోని వివిధ ప్రాంతాలలో ఆయిల్,ఆహార పదార్థాలు,పసుపు,కారం,అల్లం వంటి ప్రజలు తినే ఆహార పదార్థాలలో కల్తీ జరుగుతున్నాయన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు ఫుడ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కరీంనగర్ లోని జాఫ్రీ రోడ్, గంజ్ మరియు మార్కెట్ ఏరియా లలో గల బొల్లం శ్రీహరి కి చెందిన స్వాతి ట్రేడర్స్, ప్రభాకర్ కు చెందిన న్యూ కుమార్ ట్రేడర్స్, వల్లద్రి నరేందర్ రెడ్డి కి చెందిన అయ్యప్ప ట్రేడర్స్, కొర్లపాటి దొరబాబు కు చెందిన శ్రీ వెంకట సాయి ట్రేడర్స్, శ్రీనివాస్ కు చెందిన శ్రీ సాయి బాబా ట్రేడర్స్ లపై దాడులు చేసి కల్తీగా అనుమానం ఉన్న ఆయిల్, పసుపు, కారం మొదలగు శాంపిల్స్ ను సేకరించడం జరిగింది. వీటిని హైదరాబాద్ లోని నాచారం లో గల ఫుడ్ సేఫ్టీ లబొరేటరీ కి పంపడం జరుగుతుందని,నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.

అంతకు ముందు కరీంనగర్ బస్ స్టాండ్ ముందు గల మయురా రెస్టారెంట్ పై దాడి చేసి, సరిగా ఉన్నందున సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.

కల్తీ ఆహార అమ్మకాలపై టాస్క్ ఫోర్స్ దాడులు నిరంతరం కొనసాగుతాయి.. టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనివాసరావు

కరీంనగర్ జిల్లాలో కల్తీ ఆహార అమ్మకాలపై టాస్క్ ఫోర్స్ యొక్క దాడులు నిరంతరం కొనసాగుతాయని, ఇప్పటికైనా అక్రమార్కులు అలాంటి కల్తీలని నిలిపి వేయాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు కల్తీలకు సంబందించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న టాస్క్ ఫోర్స్ అధికారులకు తెలపాలని వారి వివరాలు గోప్యముగా ఉంచుతామని తెలిపారు.

ఇట్టి దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిఐలు శ్రీనివాసరావు,మాధవి,కిరణ్,ఎస్సై రమేష్,ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రనాధ్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.