తమిళనాడు అదికార పార్టీ అన్నా డి.ఎమ్.కె. కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయలలిత విగ్రహంపై జరుగుతున్న రచ్చ ముఖ్యమంత్రి పళనిసామికి పెద్ద చికాకుగా మారింది. విగ్రహం సరిగా లేదనో,బాగోలేదన చెబితే పర్వాలేదు.కాని అంతా జయలలిత విగ్రహం అచ్చం పళని సామి బార్య విగ్రహంలా ఉందని వ్యాఖ్యానాలు, విమర్శలు వస్తుండడంతో పళనిసామి తలపట్టుకోవలసి వస్తోంది.నెటిజన్లు మాత్రమే కాకుండా,దినకరన్ వర్గం వారు కూడా ఇవే విమర్శలు పెద్ద ఎత్తున చేస్తుండడంతో చివరికి విగ్రహాన్ని మార్చుతామని అదికార పార్టీనేతలు ప్రకటించవలసి వచ్చింది.
ఎంజీఆర్, అన్నా, పెరియార్ విగ్రహాలను నిపుణులైన శిల్పులతో తీర్చిదిద్దారని, అమ్మ విగ్రహాన్ని మాత్రం ఎందుకు ఇలా చేశారని దినకరన్ వర్గం నేతలు ప్రశ్నించారు. ఈ విగ్రహం ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సతీమణిలా ఉందని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుందని పేర్కొన్నారు. విగ్రహానికి ఆరు వేళ్లు ఉన్నాయని తెలిపారు.