పవర్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పరువు కాస్త మూసీలో కలిసింది. ఆయన పక్క నియోజక వర్గాల్లో గులాబీ కండువాలు కప్పుతుంటే… ఆయన సొంతూరు నాగారం సర్పంచ్ సావిత్రి వెంకటబిక్షం కాంగ్రెస్ కండువా కప్పుకుంది. దీంతో, నల్లగొండ ఉమ్మడి జిల్లాలో పన్నెండు నియోజక వర్గాల్లో టిఆరెస్ ను గెలిపిస్త అని బీరాలు పలుకుతున్న మంత్రికి సొంత నియోజక వర్గంలోని సొంతూరులోనే దిమ్మతిరిగినంతపనైంది. ఆయన పవరు జిల్లాలో కాదు కదా ఆయన పుట్టిన ఊరులోనే పని చేయడం లేదని తేలిపోయింది.
నిజానికి, జగదీశ్వర్ రెడ్డికి సొంత ఊరిలో సర్పంచి స్థాయి పలుకుబడి ఉంటదని అనుకోవడం కూడ సమంజసం కాదు! ఎందుకంటే ఆయన ఆయా రాజకీయ పార్టీల్లో నాయకుల వెంట కార్యకర్తగా తిరిగిండు తప్ప నాయకుడు కాదు. ఉద్యమ సమయంలోనూ కేసిఆర్ వ్యక్తిగత సహాయకునిగానే ఆయనకు గుర్తింపు. ఆ గుర్తింపుతోనే ఆయనకు కేసిఆర్ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసిండు. నాయకత్వ లక్షణాలు మచ్చుకు కనపడకున్నా మంత్రి పదవి అంటగట్టిండు. పదవి ఉంటే నాయకునిగా ఎదగక పోతడా అని ఆశపడ్డడు. కానీ, కార్యకర్తను మంత్రిని చేసినా నాయకుడు కాలేడని జగదీశ్వర్ రెడ్డి నిరూపించిండు