నేను పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదు: షర్మిల

344
I do not like party Jagan: Sharmila

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు వైయస్ షర్మిల ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

దివంగత వైయస్ అభిమానులతో ఆమె జిల్లాల వారీగా వరుస సమావేశాలు నిర్వహించింది.

ఈ రోజు విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను పార్టీ పెట్టడం తన అన్న జగన్ కు ఇష్టం లేదని షర్మిల అన్నారు.

జగన్ తో తనకున్నవి భిన్నాభిప్రాయాలో, విభేదాలో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. తనకు తన తల్లి విజయమ్మ మద్దతు ఉందని అన్నారు.

త్వరలోనే పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు. అయితే మే 14 లేక జులై 9 అన్నది మీరే చెప్పాలంటూ విద్యార్థులను ఆమె అడిగారు

రైతు సమస్యలపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తామని తెలిపారు. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నాయకురాలు విజయశాంతిలు తెలంగాణ వాళ్లేనా? అని ఆమె ప్రశ్నించారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ రాష్ట్రానికి చెందినవారు కాదని చెప్పారు. తాను పుట్టింది, పెరిగింది హైదరాబాదులోనే అని షర్మిల వ్యాఖ్యానించారు.