రాశి ఫలాలు – 10 ఆదివారం జూన్ 2018

607
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

మేషరాశి : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. కుటుంబ సభ్యులతో గడుపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

వృషభరాశి : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాంలో జాగ్రత్త అవసరం. డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. 

మిథునరాశి : ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.

కర్కాటకరాశి : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలువటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

సింహరాశి : ఈ రోజు మీరు దూర ప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీ యానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.

కన్యరాశి : ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం.

తులరాశి : ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువ సమయం గడుపుతారు. కొత్త వస్తువులు కానీ, దుస్తులు కానీ కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు నూతన లావాదేవీలు చేస్తారు. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. 

వృశ్చికరాశి : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్థులకు రావలసిన బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడులకు అనుకూలం కాదు.

ధనుస్సురాశి : ఈ రోజు పూర్తి కావలసిన పనులు చివరి క్షణంలో వాయిదా పడతాయి. దానికారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. సంతానం లేదా ఆరోగ్యం కారణంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆవేశానికి లోనవకుండా ఉండటం మంచిది.

మకరరాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కడుపు, ఛాతికి సంబంధించిన అనారోగ్యం బాధించవచ్చు. వాహన కొనుగోలు, భూ సంబంధ లావాదేవీలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. మీ జీవిత భాగస్వామి వృత్తి విషయంలో అనుకోని మార్పు చోటుచేసుకుంటుంది.

కుంభరాశి : ఈ రోజు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వాహనం చెడి పోవటం కానీ, ప్రయాణం కారణంగా ఇబ్బంది పడటం కానీ జరుగుతుంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా సోదరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. అభిప్రాయ బేధాలు ఏర్పడతాయి. మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి.


 

మీనరాశి : ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. అనుకోని చోటు నుంచి డబ్బు వస్తుంది. అయితే ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. మీరిచ్చే సలహా కూడా వివాదానికి దారి తీసేలా చేస్తుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. చెడు ఆహారం కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశముంది.