తెలుగు సినీ నటుడు గోపిచంద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర్ నిర్మిస్తోన్న ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ప్రస్తుతం రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలోని మాండవ వద్ద చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్‌లో భాగంగా ఇవాళ ఉదయం బైక్ ఛేజింగ్ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో గోపిచంద్ బైక్ స్కిడ్ అయింది. దీంతో గోపిచంద్ కిందపడిపోవడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. గోపిచంద్‌కు అక్కడి ఫోర్టిస్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.