కష్టకాలంలో పేదవారికి చేయుతనందించండి-ఎమ్మెల్యే కోరుకంటి

382
Korukanti chandar

కరానో మహమ్మరి వ్యాప్తితో నిరుపేదల జీవితాలు కష్టాల్లోకి వెళ్లాయి. వారి ముఖాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం రామగుండం కార్పోరేషన్ పరిధి 5వ డివిజన్ లో నిరుపెదలకు ఎమ్మెల్యే నిత్యవసరాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి మూలంగా రోజువారి కూలీలకు, పేదలకు ఉపాధి లేక అర్ధ అకలితో కష్టాలు ఎదుర్కునే పరిస్థితి నెలకోందని బాధను వ్యక్తం చేసారు.

5వ డివిజన్ లో

ఈ క్రమంలో తాము రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విజయమ్మ పౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలను శ్రీకారం చూట్టడం జరిగిందన్నారు. నిత్యం 8 అన్నదాన కేంద్రాల ద్వారా నిరు పెదల, నిరాశ్రయుల అకలి తీర్చుతున్నమన్నారు. పేదలకు బియ్యంతో పాటు నిత్యవసరాలు అందిస్తున్నమన్నారు. ఇలాంటి కష్టాల్లో పేదావారికి చేయుతనందించి తమ మానవాత్వన్ని చూటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడి పెల్లి అభిషేక్ రావు, 5వ డివిజన్ కార్పోరేటర్ కల్వచర్ల కృష్ణవేణి, భూమయ్య, నాయకులు విజయ్ రెడ్డి,దుర్గ ప్రసాద్, జనగామ శంకర్, తిరుపతి, ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి సివిల్ పారిశుద్ధ్య కార్మికులకు

కారోనా వైరస్ వ్యాప్తిని నివారించాంటే ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని తద్వారా కరోనా వ్యాప్తిని నివారించవచ్చని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం సింగరేణి సివిల్ పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యేగారు నిత్యవసరాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణే కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ నెల 7వ తేది వరకు లాక్ డౌన్
ప్రకటించారన్నారు. కరోనా వ్యాప్తి నేపద్యంలో పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో శ్రమిస్తున్న సింగరేణి పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమన్నారు.

దేశంలో కరోనా వ్యాప్తి అధికంగా మారుతున్న క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సమాజీక దూరం పాటించాలని, ఇళ్లకు పరిమతం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నాయకులు వెంకటేష్, బోడ్డు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆశ్రమంలో

ప్రజలంతా మానవత్వాన్ని పెంపొందించుకుని సేవ మార్గంలో నడవాలనీ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు పిలుపునిచ్చారు. సోమవారం గోదావరిఖని పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక ఆశ్రమంలో ఆజ్ 2 సింగరేణి అధికారుల అసోసియోషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు బియ్యం నిత్యవసరాలను ఎమ్మెల్యేగారి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగారు మాట్లాడారు. కరోనా మహమ్మరి వ్యాప్తి చెందుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా సేవభావాన్ని అలవర్చుకోని నిరుపేదలకు సహాయం చేయాలన్నారు. అకలితో అలమటిస్తున్న అనార్ధులకు అపన్నహస్తం అందించాలన్నారు.

Lock down

కరోనా వ్యాప్తి మెదలయిన సందర్భంలో నిరు పేదల అకలి కష్టాలను తోలగించేందుకు విజయమ్మ పౌండేషన్ ద్వారా నిత్య అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పెదలకు బియ్యం, నిత్యవసరాలను అందిస్తున్న పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, ఆర్జ్ 2 జిఎం సురేష్, ఎజిఎం సాంబయ్య, కౌటం బాబు తదితరులు పాల్గొన్నారు.