పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి – ఎమ్మెల్యే కోరుకంటి చందర్

594
Ramagundam MLA

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ఈ తరుణంలో అర్థాకలితో అలమటిస్తున్న నిరుపేదల కళ్లల్లో ఆనందం నింపడమే మానవత్వానికి నిజమైన అర్థమని, లాక్డౌన్ కారణంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు.

ఆదివారం దుర్గనగర్ ఆర్ కె గార్డెన్స్ లో చాంబర్ ఆఫ్ కామర్స్ వర్తక వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో 400 మంది పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే గారు బియ్యం నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వారు చేస్తున్నా శ్రమ ఎంతో విలువైనదని అన్నారు. పారిశుధ్య కార్మికులు చేస్తున్న శ్రమను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి పారితోషికాలు కూడా అందించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ లాక్ డౌన్ తో అన్నార్ధులకు ఆకలి కష్టాలు ఎక్కువ అయ్యాయని, వారందరి ఆకలి తీర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

లాక్ డౌన్ కారణంగా కూలీ పనులు చేసుకుని జీవించే వారికి ఉపాధిలేక అర్ధికంగా నష్టపోయి పస్తులు ఉండే పరిస్థితులన్నాయని, వారందరిని అదుకోవాన్న సంకల్పంతో విజయమ్మ పౌండేషన్ ద్వారా అన్నదాన కేంద్రాలతో పాటు బియ్యం, నిత్యవసరాలు, కూరగాయలు అందిస్తున్నమని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని, వారిని అభినందించాల్సిన అవసరం ప్రజలందరికి ఉందన్నారు. నిరుపేదలను అదుకోవాల్సిన బాధ్యత మానవాతవాదులపై ఉందని సూచించారు…