నలుగురిని ఇష్టపడ్డ అమ్మాయి.. పెళ్లి కోసం లక్కీ డ్రా!

291
Girl loves four people Lucky draw wedding!

ఓ అమ్మాయి నలుగురిని ప్రేమించి, వారితో ఊరు విడిచి వెళ్లిపోయింది. ఈ ఆసక్తికర సంఘటన ఉత్తరప్రదేశ్ లోచోటుచేసుకుంది. వారి పెళ్లి గ్రామ పెద్దలు నిర్ణయించారు.

వారిని ఊరికి తీసుకువచ్చి వారిలో ఒకరితో ఆ అమ్మాయికి పెళ్లి జరిపించేందుకు నిశ్చయించారు.

అందుకోసం ఓ లక్కీ డ్రా కూడా తీశారు.యూపీలోని అజీమ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఏకంగా నలుగురిని ఇష్టపడింది.

వారు కూడా ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. ఇటీవల ఆ అమ్మాయి నలుగురు యువకులతో కలిసి తన బంధువుల ఇంటికి చేరింది.

అయితే ఇది గ్రామ పరువుకు సంబంధించిన విషయం కావడంతో పెద్దలు ఆ అమ్మాయిని, నలుగురు యువకులను ఊరికి తీసుకువచ్చారు.

ఆ నలుగురు యువకుల్లో ఒకరిని పెళ్లాడాలని ఆ యువతికి సూచించారు. దాంతో ఆ అమ్మాయి ఎటూ తేల్చుకోలేకపోవడంతో లాటరీయే శరణ్యమని భావించారు.

ఆ నలుగురు యువకుల పేర్లు చీటీలపై రాసి ఓ చిన్నారితో లక్కీ డ్రా తీయించారు.

డ్రాలో ఓ యువకుడి పేరు రావడంతో ఆమెను  సదరు యువకుడితో పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు.