మేషరాశి :ఈ రోజు మీ ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో లేదా ప్రమోషన్ విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.
వృషభరాశి :ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం , ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవడం, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించడం చేస్తారు
మిథునరాశి :ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంతతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.
కర్కాటకరాశి :ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్యసమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
సింహరాశి :ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయడానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.
కన్యరాశి :ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అనుకూల మార్పు చోటు చేసుకుంటుంది.
తులరాశి :బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. పొరపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.
వృశ్చికరాశి :మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరో గ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోదకార్యక్రమాల్లో మునిగితేలుతారు. బంధు మిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.
ధనుస్సురాశి : ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి, గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అనుకోని సాయం కారణంగా చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో సమస్యలు తొలగి పోతాయి. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది.
మకరరాశి :ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువులమీద ఒక కన్నేసి ఉంచండి వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.
కుంభరాశి :ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.
మీనరాశి :ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమ యం. వ్యాపార వ్యవహారాలు కానీ, ఇతర ఆర్థిక లావాదేవీలు కానీ అనుకూల ఫలితాన్ని ఇస్తాయి.