రాశి ఫలాలు – ఆదివారం 18 మార్చి 2018

676
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

మేషం
ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వారు ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. శివారాధన చేయటం మంచిది.

వృషభం
ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైనా వారితో గడుపుతారు. బంధుమిత్రుల సమాగమం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం, అలాగే పాత మిత్రులను కలవటం జరుగుతుంది. సమయానికి డబ్బు అందటం వలన ఆర్థిక సంబంధ సమస్య తొలగిపోతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్దలు తొలగిపోతాయి. 

మిథునం
ఈరోజు అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న పనుల విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది. అలాగే రుచికరమైన భోజనం చేస్తారు. మీ స్నేహితులను కలుసుకుంటారు.

కర్కాటకం
ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఉదరం లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి. మీ సంతానం గురించి కానీ, ఏదైనా పోటీ విషయంలో కాని డబ్బు ఖర్చవుతుంది. చేపట్టిన పనులు చిన్నచిన్న అడ్డంకులతో పూర్తవుతాయి. పనుల విషయంలో ఆవేశానికి లోను కాకండి.

సింహం
ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వాహనం లేదా ఇంటికి సంబంధించిన ఒప్పందాలు, అమ్మకాల కారణంగా ధనలాభం కలుగుతుంది. మీ మిత్రులతో లేదా బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగవుతుంది.

కన్య
మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. మీ మిత్రులతో లేదా బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు.


తుల
మీరు అనుకున్న పనులు పూర్తి చేయటానికి, కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలమైన రోజు. అలాగే చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు.

వృశ్చికం
ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం.

ధనుస్సు
ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మీకు
ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకరం
ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూసంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి.


కుంభం
మీరు చేపట్టే పనుల్లో అవరోధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మీ కార్యాలయంలో మీరు చేయాలనుకున్న పనికి సహోద్యోగుల నుంచి వ్యతిరేకత రావచ్చు. ఆవేశానికి లోను కాకుండా సామరస్యపూర్వకంగా వ్యవహరించండి. శారీరక, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విశ్రాంతి అవసరం.

మీనం
అదృష్టం కలిసివచ్చే రోజు. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కాని ప్రశంసలు అందుకుంటారు.