రాశి ఫలాలు – శుక్రవారం 17 మార్చి 2018

672
today-friday-30-august-2019-horoscope-details
Today-Rasi-phalitalu-thursday-07-november-2019

మేషం : ఆలయాలు, హాస్టళ్లు సందర్శిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో అవాంతరాలు ఎదురవుతాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుద లతో పూర్తి చేస్తారు. రహస్య సమాచారం అందుకుంటారు.

వృషభం : మూచ్యువల్‌ ఫండ్స్‌, బ్యాంక్‌ డిపాజిట్లు, పొదుపు పథకాల వ్యవహారాలకు అనుకూల సమయం కాదు. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. స్నేహానుబంధాలు బలపడతాయి.

మిథునం : ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని చికాకులు ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగే అవకాశం ఉంది. సంకల్ప సాధనకు పట్టుదలతో కృషి చేస్తారు.కర్కాటకం : రక్షణ, రవాణా రంగాలవారు నిదానం పాటించాలి. ప్రణాళిక లోపించడంతో లక్ష్యాలు సాధించలేక పోతారు. న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం ఉంది. స మావేశాలు, వ్యూహరచనలకు అనుకూలం.

సింహం : ఆస్పత్రులు, బ్యాంకులు, చిట్‌ఫండ్‌లు, మూచ్యువల్‌ ఫండ్‌ రంగాల వారికి ఆర్థికంగా నిరుత్సాహకరం. గ్రాట్యుటీ, బీమా, పెన్షన్‌ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. బాధాకరమైన సమాచారం అందుకుంటారు.

కన్య : ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడుల్లో నష్టాలు తప్పకపోవచ్చు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.

తుల : వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. విందుల్లో పరిమితి పాటించాలి. ఇంటర్వ్యూలలో నిరాశ తప్పకపోవచ్చు. ఆస్పత్రులు సందర్శించాల్సి రావచ్చు.

వృశ్చికం : విద్యా విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. పొదుపు పథకాలు, పెట్టుబడుల విషయంలో ఆచితూచి ముందడుగు వేయండి.


ధనుస్సు : కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. బదిలీ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కార్యాలయంలో కొంత అసౌకర్యానికి గురవుతారు. వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.

మకరం : విద్యార్థులు లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేయాల్సి ఉంటుంది. వాహనాల కారణంగా అసౌకర్యానికి గురవుతాయి. రిప్రజెంటేటీవ్‌లు, ఏజెంట్లకు శ్రమాధిక్యం. సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది.

కుంభం : బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు అటంకాలు కలిగే అవకాశం ఉంది. డిపాజిట్లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. రుణప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి.

మీనం : మనసును ఏదో వెలితి బాధిస్తుంది. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురువుతాయి. కొత్తగా చేపట్టే పనుల ప్రారంభాన్ని వాయిదా వేయండి. అన్ని విషయాల్లో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు.