ఆత్మీయులు చనిపోయి అంత్యక్రియలకు చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న పేదప్రజల కష్టాలను తీర్చడానికి ఉచితoగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయవలసిందిగా రామగుండంo శాసన సభ్యులు గౌ. శ్రీ కోరుకంటి చందర్ గారు జారీ చేసిన ఆదేశాల ప్రకారం మొదటిసారిగా ఉచిత వైకుంఠ రథ ( వాహన) సేవలను రామగుండo నగర పాలక సంస్థ అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైకుంఠ రథ( వాహన) సేవలు పొందడానికి రామగుండం నగర పాలక సంస్థ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ మునిసిపల్ చట్టం ప్రకారం ఈ సేవలు మీకు సెప్టెంబర్ 1 వ తేదీ నుండి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నది.
రామగుండo నగర పాలక సంస్థ కమీషనర్ మాట్లాడుతూ వైకుంట రథ సేవలను పొందడానికి రామగుండం నగర పాలక సంస్థ టోల్ ఫ్రీ నెం : 18004257062 కు కాల్ చేయండి. మీ పేరు , చిరునామా , ఫోన్ నెంబర్ చెప్పండి. మీరు చెప్పిన చోటుకు మా వాహనం ( వైకుంట రథం ) వస్తుంది. ఉచితంగా మీ ఆత్మీయుల పార్దీవ శరీరాన్ని అంత్యక్రియల కొరకు తరలిస్తుంది. కావున పేద ప్రజలు ఈ సేవలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాము అని తెలియజేసారు.
పని వేళలు: ప్రతి రొజూ ఉదయo 6.00 గంటల నుండి సాయoత్రం 6.00 గంటల వరకు ( సెలవు దినాల్లో కూడా ).
ఈ సేవలు కులము, మతముతో ప్రమేయం లేకుండా అందరికి నిరుపేదలందరికీ అందించబడుతాయి.