ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దసరా పండుగను పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్ అక్టోబర్ 4వ తేదీ వరకు కొనసాగనుంది. కాగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు 4 గంటల ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు.
అలాగే ఫ్యాషన్, టీవీలు, అప్లయెన్సెస్, హోమ్ అండ్ ఫర్నిచర్, బ్యూటీ, స్పోర్ట్స్, టాయ్స్, బుక్స్, స్మార్ట్ డివైసెస్, పర్సనల్ కేర్ అప్లయెన్సెస్, ట్రావెల్, మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్, యాక్ససరీలపై ప్రత్యేక రాయితీలను ఈ సేల్‌లో అందివ్వనున్నారు. ఇందులో భాగంగా పలు వస్తువులను నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే అవకాశం కూడా కల్పించనున్నారు.