దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం అమలవుతుందని, తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్ గారు పాలనలో రైతుల సుభిక్షంగా విరాజిల్లుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు.
సోమవారం రామగుండం నియోజవర్గం పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలో రైతు వేదికను, వ్యవసాయకమిటి నూతన భవానానికి శంకుస్థాపన, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణ, అంతర్గాం మండలంలో రైతు వేదికలను రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డిగారు, ఎంపి వెంకటేష్ నేతగారు, జిల్లా జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ గారు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు , ఎమ్మెల్సి నారదాసు లక్ష్మణ్ రావు గారు కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా రైతు సంక్షేమం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత సిఎం కేసీఆర్ గారిదన్నారు. దేశానికే తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆదర్శంగా నిలపాలన్న సంకల్పంతో సిఎం కేసీఆర్ గారు నిత్యం శ్రమిస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసిన ఏకైక సీఎం కేసిఆర్ గారని అన్నారు.
ఎంతో గొప్పగా కాళేశ్వర ప్రాజెక్టును నిర్మాణం చేసి గోదావరి నదికి జీవకళ తెచ్చి తెలంగాణ రైతంగా భాదలను తొలగించారని అన్నారు. ఆధునిక వ్యవసాయం, సాంకేతిక పద్ధతులు, నూతన వంగడాలు, రైతులు చర్చించేందకు రైతు వేదికలు ఉపయోగపడుతాయని, రైతులకు అవసరమైన సాగులో మెలుకవలు, శిక్షణ, సమచారం, శాస్త్రీయ పరిజ్ఞానం ఈ వేదిక ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు. రైతుల అవస్థలు తీర్చిన రైతు పక్షపాతి సిఎం కేసీఆర్ గారని అన్నారు.
రామగుండం నియోజకవర్గంలోని రైతులకు సబ్సిడి పైన యాంత్రాలు అందించాలని, రైతులు పండించిన పంటను నిల్వ చేసుకోనెందుకు కోల్డ్ స్టోరేజ్ ను ఏర్పాటు చేయాలని మంత్రి గారిని కోరారు అదేవిదంగా నూతనంగా నిర్మాణం కానున్న పుట్నూరు వ్యవసాయ మార్కెట్ భవణానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరారు.