12 వ డివిజన్ ఆశ వర్కర్లకు కోవిడ్ వాక్సిన్

188
covid vaccine to 12 division asha workers

ఈ రోజు రామగుండము నియోజకవర్గం, గోదావరిఖని లోని 5ఇంక్లైన్ UPHC సెంటర్ లో ఆశ కార్యకర్తలకు మరియు హెల్త్ కి సంబంధించిన స్టాఫ్ అందరికి కోవిడ్-19ఇంజక్షన్ లు ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న 12 వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత మాట్లాడుతూ కరోన బారినుండి ప్రజలను కాపాడే క్రమంలో అగ్రభాగాన నిలబడి కరోన తో పోరాడినటువంటి మా డాక్టర్ లకు, ఆశ వర్కర్ లకు, శానిటేషన్ సిబ్బందికి మరియు పోలీస్ అన్నలకు హృదయపూర్వక ధన్యవాదములు.

ఇందులో భాగంగా మొట్ట మొదలు ప్రభుత్వం హెల్త్ వర్కర్లకు మొదటి ప్రాధాన్యత గా గుర్తించి ఆశ వర్కర్ లకు మరియు ఆరోగ్య సిబ్బందికి ఈ కోవిడ్ ఇంజక్షన్ లు ఇవ్వడం చాలా సంతోష దాయకం. అంతే కాకుండా ఈ వాక్సిన్ మన దేశం లోనే తయారు అయ్యి ప్రపంచ దేశాల కు కోవిడ్ టికను అందించిన సంస్థను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ లు, లాబ్ సురేష్, ANM రమ, లక్ష్మీ తో పాటు UPHC సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.