హ‌రిత హారం పై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

510
harithaharam

తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు 6వ విడ‌త హ‌రిత హారం కార్య‌క్ర‌మంపై హైదరాబాద్ లోని తన పేషీ నుంచి సన్నాహకంగా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లు, జెడ్పీ సీఇఓలు, డిఆర్ డిఓలు, డిపిఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, స‌ర్పంచ్ లు, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు, మండ‌ల స్థాయి అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు.

హ‌రిత హారం కార్యక్రమం ఒక ఉద్య‌మంగా సాగాలని, ఉధృతంగా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం చేపట్టాలని పేర్కొన్నారు. జీవ వైవిధ్యం, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణకు మనమంతా పాటుప‌డాలని, ప్రతి ఇంటికి 6 మొక్కలు సరఫరా చేయాలి… ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాలి అని తెలియజేశారు.

నాటిన మొక్క‌లు నూటికి నూరు శాతం బ్రతికుండేలా చూడాలి. ప్ర‌జ‌ల‌ను గ్రామ స‌భ‌ల ద్వారా స‌మాయ‌త్త ప‌ర‌చాలి అని మంత్రి అన్నారు. గ్రామ పంచాయ‌తీల్లోని ప్లాంటేష‌న్, గ్రీన్ క‌వ‌ర్ క‌మిటీలు క్రియాశీల‌కంగా ప‌ని చేయాలి. ఎప్ప‌టిక‌ప్పుడు న‌ర్స‌రీలు, నాటిన మొక్క‌ల‌ను తనిఖీ చేస్తూ, అధికారులు పర్యవేక్షించాలి.

హరిత హారం -2020 ప్రాధాన్యతపై సన్నాహక చర్యలు చేపట్టాలి. ప్ర‌జాప్ర‌తినిధులు స‌హా, జిల్లా, మండ‌ల స్థాయి అధికారులు, గ్రామ కార్య‌ద‌ర్శులు ప‌ర్య‌వేక్షించాలి అని అధికారులకు సూచనలు చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం ఓ ఎస్ డి హరిత హారం ప్రియాంక వర్గీస్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఉపాధి హామీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు