సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలి – ఎమ్మెల్యే రేఖా నాయక్

447
Khanapur MLA

సిఆర్టిల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ టీచర్ ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఏమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ అన్నారు. పలువురు సిఆర్టి సంఘం నాయకులు ఉట్నూర్ లో ఏమ్మెల్యే ను కలవగా వెంటనే వారి సమస్యలు పరిష్కారం చేయాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి భవేష్ మిశ్రా ను కోరగా, కమీషనర్ కు సమస్య తీవ్రతను వివరించి పరి‌ష్కారం అయ్యేలా చేస్తానని చెప్పారు. అలాగే గూడెం లో నేలకోని ఉన్న ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు.

ఆసుపత్రి వైద్యులతో సమీక్ష

ఉట్నూరు మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్, జడ్పి చైర్మన్ జనార్ధన్ రాథోడ్ లు వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆసుపత్రిలో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు.పలువురు వైద్యులు డిప్యూటేషన్ పై ఆదిలాబాద్ కు వెళ్ళారని తెలపగా వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటేల రాజేందర్ తో ఫోన్ లో మాట్లాడారు.ఇక్కడి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.డిప్యూటేషన్ పై వెళ్ళిన వైద్యుల డిప్యూటేషన్ రద్దు చేయాలని మంత్రికి వివరించారు.నూతనంగా బ్లడ్ బ్యాంక్ కేంద్రాన్ని ప్రారంభించారు.

meeting with Doctors

పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఏమ్మెల్యే

ఇటివల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉట్నూర్ మండల కో ఆప్షన్ మెంబర్ సాజిద్ కుటుంబాన్ని ఏమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ పరామర్శించారు. ఎంకా గ్రామానికి వెళ్లి మృతుడి భార్య పిల్లలను కలిశారు.వారిని ఓదార్చి అండగా ఉంటానని చెప్పారు.అదే విధంగా ఇటివల గుండె పోటుతో మరణించిన తుడుందెబ్బ నాయకుడు అత్రం భగవంత్ రావు కుటుంబాన్ని కూడా పరామర్శించారు.వారి కుటుంబానికి సాయం అందించడానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

with effected families

ఉపాధితో కాలువలకు మరమత్తులు

ఉపాధిహామీ పథకంలో కూలీలకు ఉపాధి కల్పిస్తూ, ప్రభుత్వం సాగు నీటి కాలువలకు మరమత్తులు చెయించడం జరుగుతుందని ఏమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ అన్నారు.
సోమవారం ఉట్నూర్ మండలం కెబి కాంప్లెక్స్ ముందర ఉన్న చెరువు దగ్గర కాలువ మరమత్తు పనులను ప్రారంభించారు.కరోన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

upadi hami panulu