కేసీఆర్ మౌనాన్ని తక్కువగా అంచనా వేయొద్దు: కేటీఆర్

324
BJP leaders give only slogans: KTR

కేసీఆర్ మౌనాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయొద్దని తెలంగాణ మంత్రి కేటీఆర్ విపక్షాలను హెచ్చరించారు.

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అంటే కొందరు లెక్కలేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

అలాంటి వారికి వడ్డీతో పాటు చెల్లిస్తామని హెచ్చరించారు.గోడకు వేలాడదీస్తే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందన్నారు.

సమయం వచ్చినప్పుడే దాని సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ మాట్లాడితే ఎలా ఉంటుందో తెలంగాణ మొత్తానికి తెలుసని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎంలనే హడలెత్తించిన పార్టీగా టీఆర్ఎస్ కు ఘనచరిత్ర ఉందని ఆయన అన్నారు.

వాట్సాప్ వర్సిటీలో బీజేపీ నేతలు అబద్ధాలు నేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు.