తెలంగాణ జాగృతికి దాసరి శ్రీనివాస్ రాజీనామా

813
dasari srinivas resigns to telangana jagriti

తెలంగాణ జాగృతి ఐటీ విభాగ రాష్ట్రాధ్యక్షుడు శ్రీనివాస్ దాసరి ఆ సంస్థ ప్రాథమిక సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. జాగృతిలో వివిధ స్థాయిల్లో పనిచేశానని, అందుకు అవకాశం కల్పించిన తమ నాయకురాలు, ఎంపీ కవితకు ధన్యవాదాలు చెబుతున్నానని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.


సంస్థ కార్యకలాపాల నిర్వహణలో తనకు తోడ్పాటు అందించిన వారందరికీ ధన్యావాదాలు తెలుపుతున్నానన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానన్నారు. శ్రీనివాస్.. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితిలో చేరే అవకాశమున్నట్లు సమాచారం!