గుర్తింపు కార్డు చూపిస్తే కరోనా వ్యాక్సిన్!

234
Two elderly people died corona vaccine

దేశవ్యాప్తంగా జనవరి 16న ప్రారంభమయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది.

అర్హులైన వారు మార్చి 1 తరువాత కరోనా టీకాను తీసుకోవాలంటే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుందని కో-విన్ ప్యానల్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు.

దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో రెండు రోజుల్లో మొదలుకానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లబ్దిదారులు యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.

టీకాను వేయించుకునేందుకు తమ అర్హతను తెలిపేలా వయసు గుర్తింపు కార్డును తీసుకని వెళ్లి కూడా అక్కడికక్కడే వ్యాక్సిన్ తీసుకోవచ్చని ఆయన అన్నారు.

వ్యాక్సినేషన్ కోసం స్వీయ రిజిస్ట్రేషన్ ను కూడా సులభతరం చేశామని చెప్పారు.

తమ స్మార్ట్ ఫోన్లలో కోవిన్ డాట్ గవ్ డాట్ ఇన్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చని అన్నారు.

మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్)ను ఎంటర్ చేస్తే, టీకా తీసుకునేందుకు సంబందించిన సమాచారం  మెసేజ్ రూపంలో వస్తుందని శర్మ స్పష్టం చేశారు.

ఇంట్లో ఒకే వ్యక్తి వద్ద ఫోన్ ఉన్నప్పటికీ , అతనితో పాటు మిగతావారు కూడా రావచ్చని పేర్కొన్నారు. గుర్తింపు కార్డు చూపి ఆయా ఆరోగ్య కేంద్రాల్లో టీకా తీసుకోవచ్చని అన్నారు.

రెండో దశలో మొదట 45 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు తమకున్న దీర్ఘకాల రోగాల వివరాలు తెలిపి టీకా తీసుకోవచ్చని తెలిపారు.

60 ఏళ్లకు పైబడిన వారు మామూలుగానే రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ పొందవచ్చని ఆయన అన్నారు. దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులు డాక్టర్ సర్టిఫికెట్ ను అందజేయాలని సూచించారు.