కోడలిపై మామ లైంగికదాడి

197
pouring petrol wife setting her on fire ..!

వావివరుసలు మరచిపోయి ఓ కిరాతకుడైన మామ పశువులా ప్రవర్తించాడు. తన కుమారుడి భార్య అన్న కనికరం లేకుండా కోడలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

తాజాగా ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. కోడలు ఎంతగా అడ్డుకున్న ఆ మామ బలం ముందు ఆమె గెలవలేకపోయింది. ఈ ఘటన నుంచి తేరుకున్న తర్వాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నగరంలోని ఓ లాడ్జిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే వ్యాపార నిమిత్తం ఢిల్లీ నుంచి 21 ఏళ్ల కోడలు తన మామతో కలిసి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చింది.

హబీబ్ నగర్ లోని సుభాన్ బేకరీకి దగ్గరలో ఓ లాడ్జిలో తాత్కాలికంగా ఉండేందుకు ఆ మామా కోడళ్లు రెండు రూమ్స్ తీసుకున్నారు.

హైదరాబాద్ నుంచి వస్త్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఢిల్లీలో విక్రయించేవారు.

బుధవారం రాత్రి లాడ్జిలో తన గదిలో ఉండగా మామ వచ్చాడు. మామయ్యే కదా అని లోపలికి రానివ్వడమే ఆమె చేసిన పొరపాటయింది.

లోపలికి వచ్చిన వెంటనే ఆ మామ ఆమెపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడు.

అనంతరం ఆమె గురువారం హబీబ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.