సిబ్బందికి కరోనా.. రెస్టారెంట్‌ సీజ్‌

596
Corona to the staff .. Restaurant‌ siege

మహారాష్ట్రలో కరోనా చాపాకింద నీరులా విజృంభించడంతో  కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ముంబైలో నిన్న ఒక్కరోజే వెయ్యి కరోనా కేసులు నమోదయ్యాయి. గత పది రోజుల్లో ఏడు రోజులపాటు వెయ్యికిపైగా మంది వైరస్‌ బారినపడ్డారు.

రాజధాని ముంబైలోని అంధేరీలో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో 10 మంది ఉద్యోగులు కోవిడ్ బారినపడ్డారు.

దీంతో ఆ రెస్టారెంట్‌ను బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) సీజ్‌ చేసింది.

ఇక పట్టణంలోని మురికివాడల్లో 14 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండగా, 185 బిల్డింగులను సీజ్‌ చేశారు.

అంధేరి వెస్ట్‌లోని రాధా కృష్ణా రెస్టారెంట్‌లో 10 మంది స్టాఫ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిందని బీఎంసీ శుక్రవారం వెల్లడించింది.